నాకంటే ముదుర్లు ఉన్నారు!

బోనీ కపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ పెళ్లి గురించి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలొస్తున్నాయి. తన కంటే వయసులలో పెద్దదైన మలైకాను త్వరలో వివాహం చేసుకోనున్నారని చెప్పుకుంటున్నారు. ఇదే విషయంపై కొంతమంది అర్జున్‌ కపూర్‌ను అడగ్గా..‘‘నా వ్యక్తిగత విషయాలు తప్ప మీకు అడగటానికి ఇంకేం విషయాలు లేవా. ఇప్పుడు నా వయసు ముఫ్పైమూడు. ఇంతకంటే పెద్ద వయసున్న వాళ్లు ఇండియాలో చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ల సంగతి చూడండి. నేను ఏం చేసినా మీకు తెలుస్తుంది. నేను మీ దగ్గర దాచిపెట్టేంత రహస్యమైతే ఏం లేదు. పెళ్లిచేసుకొంటే అందరికి చెప్పే చేసుకుంటానని’’ సమాధానమిచ్చారట. ఈ మధ్యనే అర్జున్‌ నటించిన ‘ఇండియా’స్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ చిత్రం మే 24, 2019న తెరపైకొచ్చి సందడి చేస్తుంది. ప్రస్తుతం అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘పానిపట్‌’ అనే చిత్రంలో సదాశివ్‌రావు బాహు అనే పాత్రలో నటిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.