బాలీ‌వుడ్‌ దాదా‌ముని
article image
అల‌నాటి హిందీ హీరో, క్యార‌క్టర్‌ నటుడు అశో‌క్‌కు‌మార్‌ ఐదు దశా‌బ్దాల పాటు లక్ష‌లాది సినీ అభి‌మా‌నుల గుండెల్లో స్థానం నిలు‌పు‌కున్న ప్రతి‌భా‌వం‌తుడు.‌ గౌర‌వ‌సూ‌చ‌కంగా అశో‌క్‌కు‌మా‌ర్‌ను హిందీ చిత్రసీ‌మలో ‌‘దాదా‌ముని’‌ అని సంబో‌ధిం‌చే‌వారు.‌ అశో‌క్‌కు‌మార్‌ అసలు పేరు కుము‌ద్‌లాల్‌ గంగూలీ.‌ చిత్రసీ‌మకు పెద్ద‌న్న‌లాం‌టి‌వారు.‌ దాదా‌ముని గురించి మనకు తెలి‌యని సంగ‌తులు ఎన్నో ఉన్నాయి.‌ అతడు హోమియా వైద్యం చేసే‌వారు.‌ ఎంతో పెద్ద వైద్యులు నయం చేయ‌లేని రుగ్మ‌త‌లను పోగొ‌ట్టిన హోమియా వైద్యు‌నిగా అశో‌క్‌కు‌మా‌ర్‌కు మంచి పేరుం‌డేది.‌ అంతే కాకుండా అతడు ఒక మంచి చిత్రకా‌రుడు కూడా.‌ సిని‌మాలో వేషాలు వేయక ముందు కొంత‌కాలం బాంబే టాకీస్‌ స్టూడి‌యోలో లేబ‌రే‌టరీ సహా‌య‌కు‌నిగా సేవ‌లం‌దిం‌చారు.‌ సినిమా హీరోగా నటించే అవ‌కాశం అశో‌క్‌కు‌మా‌ర్‌కు అను‌కో‌కుండా వచ్చింది.‌ బాంబే టాకీస్‌ అధి‌పతి హిమాం‌శు‌రాయ్‌ భార్య ప్రఖ్యాత నటీ‌మణి దేవి‌కా‌రాణి.‌ 1936లో హిమాం‌శు‌రాయ్‌ ‌‘జీవన్‌ నయా’‌ అనే సినిమా ప్రారం‌భిస్తూ అందులో హీరోగా నజ్ముల్‌ హస‌న్‌ను తీసు‌కు‌న్నాడు.‌ సినిమా నిర్మాణ సమ‌యంలో నజ్ముల్‌ హసన్‌ దేవి‌కా‌రా‌ణికి సన్ని‌హి‌తంగా మెలు‌గుతూ, ఒక రోజు ఆమెను ఎత్తు‌కె‌ళ్లి‌పో‌యాడు.‌ అశో‌క్‌కు‌మార్‌ బావ దౌత్యంతో దేవి‌కా‌రాణి హిమాం‌శు‌రాయ్‌ వద్దకు తిరిగి చేరు‌కుంది.‌ అప్పుడు నజ్ముల్‌ హస‌న్‌ను తొల‌గించి హిమాం‌శు‌రాయ్‌ హీరో అవ‌కా‌శాన్ని అశో‌క్‌కు‌మా‌ర్‌కు కలి‌పిం‌చాడు.‌ అలా అశో‌క్‌కు‌మార్‌ తెరం‌గేట్రం చేశారు.‌ అదే సంవ‌త్సరం దేవి‌కా ‌రా‌ణితో అశో‌క్‌కు‌మార్‌ ‌‘అచ్యు‌త్‌కన్య’‌ సిని‌మాలో హీరోగా నటిస్తే, ఆ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి అశో‌క్‌కు‌మా‌ర్‌ని హీరోగా నిల‌బె‌ట్టింది.‌ అశోక్‌ నటిం‌చిన ‌‘కిస్మత్‌’‌ (1943) సినిమా ఆరో‌జు‌ల్లోనే కోటి రూపా‌యల వసూళ్లు రాబట్టి ‌‘కోటి‌క్లబ్‌’‌కు అంకు‌రా‌ర్పణ చేసింది.‌ నిర్మా‌తగా వ్యవ‌రిస్తూ నిర్మిం‌చిన ‌‘జిద్ది’‌ (1948) సిని‌మాతో దేవా‌నం‌ద్‌కు బ్రేక్‌ ఇచ్చింది దాదా‌మునే! 1949లో అశో‌క్‌కు‌మార్‌ నిర్మిం‌చిన ‌‘మహల్‌’‌ సినిమా ద్వారా మధు ‌బా‌లను కథా‌నా‌యి‌కగా పరి‌చయం చేసిన ఘనత కూడా ఆయ‌నదే.‌ 1988లో తమ్ముడు కిశోర్‌ కుమార్‌ కాలం చేశాక, పుట్టి‌న‌రోజు వేడు‌క‌లకు స్వస్తి పలి‌కారు.‌ ఈ దాదా‌సా‌హె‌బ్‌ఫాల్కే, పద్మ‌భూ‌షణ్‌ పుర‌స్కా‌రాల గ్రహీత అశో‌క్‌కు‌మార్‌.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.