ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించిన రన్వీర్‌సింగ్‌

బాలీవుడ్‌ నటుడు రన్వీర్‌సింగ్ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. తాజాగా రన్వీర్‌సింగ్‌ నిర్మాతగా సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించాడు. ఆ సంస్థ పేరు మా కసమ్‌ ఫిల్మ్స్. అస్సలు ఈ సంస్థని తన తల్లి అంజు భావ్నానితో కలిసి డిసెంబర్‌ 28, 2017నే నమోదు చేశాడు. గతంలో ఓ సమావేశంలో రన్వీర్‌సింగ్‌ మాట్లాడుతూ..టీజనేజర్స్ కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయాలని చేయాలని భావిస్తున్నా. నాకు వ్యాపార చతుర లేదు. ముఖ్యంగా సృజనాత్మకత నిర్మాతను అసలే కానని చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో చాలామంది నాయికానాయకులు సొంత నిర్మాణ సంస్థలు స్థాపించారు. విజయవంతంగాను నిర్వహిస్తున్నారు. తాజాగా రన్వీర్‌ సింగ్‌ ప్రొడక్షన్‌పై కొంతమంది సినీమా రంగానికి చెందిన వాళ్లు మాట్లాడుతూ..రన్వీర్‌సింగ్‌ వినోధభరితమైన, భారీ చిత్రాలను నిర్మించగలరు. ప్రస్తుతం చిత్రసీమకు ఇలాంటి సంస్థలు కూడా ఎంతో అవసరం అని చెబుతున్నారు. రన్వీర్‌సింగ్‌ సంగీత ప్రపంచానికి సంబంధించి ఇంక్‌ఇంక్‌ అనే సంస్థను స్థాపించారు. ఇక భార్య దీపికా పదుకొణెతో కలిసి చాక్‌ అండ్‌ చీజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థను 2019లో స్థాపించారు. దీపికా కూడా సొంతంగా కెఎ ప్రొడక్షన్‌ అనే ప్రొడక్షన్‌ హౌస్‌ని స్థాపించి ఛపాక్‌ అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో తన కథనాయికగా యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో నటించి అలరించింది. మొత్తం మీద బాలీవుడ్‌లో చాలామంది నాయికానాయకులు భార్యాభర్తలుగా ఉంటూనే సొంత నిర్మాణసంస్థలు స్థాపించి ముందుకుపోతున్నారు.  అనుష్క శర్మ, కంగనా రనౌత్‌లు కూడా ప్రొడక్షన్‌ హూస్‌లు స్థాపించి, చిత్రాలను నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.