కరోనా వైరస్‌తో కన్నుమూసిన గౌరవ్‌ చోప్రా తండ్రి

బాలీవుడ్‌ నటుడు, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్టు గౌరవ్‌ చోప్రా తండ్రి అయిన స్వతంత్ర చోప్రా కన్నుమూశారు. గత కొంతకాలంగా తల్లితండ్రులు కరోనా వైరస్‌ పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరారు. పదిరోజుల కిత్రం ఆయన తల్లి మరణించింది. మూడేళ్లుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. ఇలా తల్లితండ్రులిద్దరూ వరుసగా చనిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్బంగా నటుడు గౌరవ్‌ చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తండ్రి గురించి స్పందిస్తూ..నా హీరో, నా రోల్‌ మోడల్‌, ఆదర్శవంతమైన వ్యక్తి. ఆదర్శవంతమైన కుమారుడు, ఆదర్శవంతమైన సోదరుడు, తండ్రి..ఇలా అన్నింటికంటే ఓ మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్లు పట్టింది. ఆయన చాలా ప్రత్యేకం. ఆయన కొడుకుగా, వారసత్వాన్ని నిలబెడతాను. చిన్నతనంలో నేను వీధిలో నడుస్తున్నప్పుడు ఆయన కుమారుడిగా గుర్తించారు. ఆయన తనయుడి కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టి పిలుస్తారు. ఏదైనా అంగడికి వెళ్తే నా దగ్గర తక్కువ పైకం తీసుకుంటారు. ఎవరైనా తెలియని వ్యక్తులు మాఇంటి దగ్గర కొచ్చి చోప్రా సాబ్‌ ఇల్లు ఎక్కడ అని అడగండి ఎవరైనా మా ఇంటికి తీసుకొస్తారు. అంతటి ఔదార్యం గలవాడు నాన్న. ఆయనకు అన్నింటి చాలా ఉదారవాది. ప్రేమ, గొప్పదనం, ఇలా ఎన్నో గుణాలు ఆయనలో ఉన్నాయి. ఒక ఆదర్శ భర్తగా గత నాలుగేళ్లుగా అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకొన్నారు. ఆమెను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమె ఆగస్టు 19న మమ్మలి విడిచి వెళ్లింది. నాన్న ఆగస్టు 29న కాలం చేశారు. 10 రోజుల్లో ఇద్దరూ పోయారు. ఈ శూన్యమైన, శూన్యత ఎప్పటికి పూడ్చలేరు. మేరే పాపా అంటూ తనలోని బాధను తెలియజేశారు. గౌరవ్‌ చోప్రా ఇటు సినిమాల్లో అటు బుల్లితెరపై నటించి అలరించారు. బ్లడ్‌ డైమండ్‌ అనే హాలీవుడ్ చిత్రంలో హీరో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ కాన్నేల్లీ కలిసి ఓ ఫ్రెంచ్‌ పాత్రికేయుడు నటించారు. థోర్‌: రాగ్నరాక్‌, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌, అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ చిత్రాల్లో నటుడు క్రిస్‌ హెమ్స్ వర్త్‌కి వాయిస్ ఓవర్‌ ఇచ్చారు.

 

View this post on Instagram

A post shared by Gaurav Chopraa (@mrgravitas) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.