నటుడు గోవింద తనయుడికి ప్రమాదం

బాలీవుడ్‌ నటుడు గోవింద పేరు వినగానే మనకు గుర్తొచ్చే చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లోని హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. తాజాగా ఆయన కుమారుడు యశ్వర్ధన్‌ అహుజా ఓ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. గత రాత్రి ముంబైలోని జుహా ప్రాంతంలో యశ్వర్ధన్‌ కారు ప్రమాదానికి గురైంది. యశ్వర్థన్‌ చేతికి చిన్నగాయమైంది. అయితే కారుకి హెడ్‌లైట్స్ మాత్రమే పాడైయ్యాడట. ఇందులో మిగతా ఎవరికి ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ఈ ప్రమాదంలో తీవ్రత లేనందున ఎటువంటి కేసులు లేకుండా ఇరువర్గాలు రాజీ పడ్డాయట. గోవింద గత ఏడాది రంగీలా రాజా చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇక యశ్వర్ధన్‌ అహూజా లండన్లో ఫిల్మ్ మేకింగ్‌ పూర్తి చేసుకున్న తరువాత ఇండియా తిరిగి వచ్చాడు. సాజిద్‌ నదియాద్‌వాలా దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. యశ్వర్ధన్‌కి నటన కంటే కూడా సినిమా నిర్మాణం పట్ల ఆసక్తి ఎక్కువట.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.