‘రాజు రంగీలా’గా గోవింద్‌
బాలీవుడ్‌ నటుడు గోవింద ఇప్పుడు ఓ కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇంతకీ ఆ చిత్రం పేరేమటి అనుకొంటున్నారా? ‘రాజు రంగీలా ’. మాజీ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు ఛైర్మన్, నిర్మాత, దర్శకుడు పహ్లాజ్‌ నిహలానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘కథ మొత్తం కింగ్‌ఫిషర్‌ యజమాని విజయమాల్యా గురించే ఉంటుందని’’ చెప్తున్నారు. ఇందులో గోవిందా మూడు రకాల పాత్రలు చేస్తున్నాడంట. ‘‘ఇది పూర్తిగా మాస్‌ మసాలతోపాటు, వినోదాన్ని పండించే విధంగా ఉంటుందని పహ్లాజ్‌ చెప్తున్నా’’రు. ప్రభుత్వ బ్యాంకులను మోసం చేసి విజయమాల్యా విదేశాలకు పారిపోయారు. కథ మొత్తం పూర్తిగా ఆయన చుట్టూనే తిరుగుందట. మాల్యా జీవితమే ఈ చిత్రానికి ప్రధాన కథని చెప్తున్నారు నిహలానీ. నిహలానీ, గోవింద చాలా సంవత్సరాల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం గోవింద ‘ఫైడే’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.