‘హ్యాపీ న్యూయర్‌2’ కోసం మీరు రావాలి!

భిషేక్‌ బచ్చన్‌ సామాజిక మాధ్యమాల్లో చరుగ్గా ఉంటారు. తన మనసులోని మాటలు అస్సలు దాచుకోడు. ఇప్పుడు అలాంటి విషయమే ఒకటి బయటపెట్టాడు. బాలీవుడ్‌ దర్శకురాలు ఫరాఖాన్‌ 2014 మలచిన హాస్య చిత్రం ‘హ్యాపీ న్యూయర్‌’. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌ నందు పాత్రలో చేసిన సందడి అంతాఇంతా కాదు. అప్పట్లో తనతో నటించిన సహచర నటీనటులకు ‘హ్యాపీ న్యూయర్‌’ను సీక్వెల్‌ చేద్దాం. నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రావాలి అంటూ అభిషేక్‌ ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ఫరాఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ న్యూయర్‌’లో షారుఖ్‌ఖాన్, దీపికా పదుకొణె, సోనూ సూద్, బొమన్‌ ఇరానీ, జాకీష్రాఫ్‌లాంటి భారీ తారగణంతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.