97కోట్లు వెచ్చింది ప్లాట్స్ కొనుగోలు చేసిన హృతిక్‌ రోషన్‌

కహో నా.. ప్యార్ హై’, ‘కొయి మిల్‌ గయా’, ‘సూపర్‌ 30’లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన కథానాయకుడు హృతిక్‌ రోషన్‌. రోషన్‌కి కుటుంబం అంటే ఏంతో ప్రేమ. హృతిక్‌ సుజాన్‌ ఖాన్‌ వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సుజానే - హృతిక్‌ విడిపోయి ఎవరికి వారే వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హృతిక్‌ ముంబైలో 97.50 కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అపార్టుమెంట్లు కొన్నారట. అవి సముద్రానికి అభిముఖంగా కలిగి ఎంతో ఆహ్లాకరంగా ఉండేటట్లు. ఈ అపార్ట్ మెంట్‌లో సుమారు 10 పార్కింగ్‌ స్లాట్సు్ కూడా ఉన్నాయట. ఈ భవనంలో 15, 16 అంతస్తుల్లో 27534 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ కోసం హృతిక్‌ 67.5 కోట్లు చెల్లించారట. ఇక 14 అంతస్తులో 11165 చదరపు అడుగు విస్తీర్ణానికిగాను సుమారు 30 కోట్లు రూపాయలు వెచ్చించారట. లాక్‌డౌన్‌ సమయంలో తన మాజీభార్యతో కలిసి పిల్లల కోసం ఒకే చోట కలిసి ఉన్నారు. ఈ మధ్యే హృతిక్‌ రోషన్‌ తల్లి పింకీ రోషన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. బాలీవుడ్ డ్యాన్స్ కింగ్‌ అయిన హృతిక్‌ ‘క్రిష్‌ 4’ చిత్ర షూటింగ్‌ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్‌ సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.