కరోనాతో ఒక్కటైన హృతిక్‌ దంపతులు

ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా చూసిన కరోనా గురించే ఆందోళన చెందుతున్నారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ తన భార్య సుస్సానే ఖాన్‌ ఎప్పుడో విడిపోయారు. గత కొన్నాళ్లుగా హృతిక్‌ తన పిల్లలతో కలిసి ఒక్కరే ఉంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు సుస్సానే తన పిల్లలతో కలిసి ఉండటానికి ముందుకొచ్చింది. భార్యాభర్తలుగా విడిపోయినా పిల్లలకు తల్లితండ్రులుగా తమ బాధ్యతను ప్రతి ఒక్కరు నిర్వర్తించాలంటూ హృతిక్‌ కోరుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన మాజీ భార్య సుస్సానేకు కృతజ్ఞతలు తెలుపుతూ..‘‘తల్లితండ్రులు తమ పిల్లలను దగ్గరగా ఉండటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు సుస్సానే ఖాన్‌ (నా మాజీ భార్య)కు ధన్యవాదాలు. మేము పిల్లల కోసం, ఆరోగ్యాన్ని కాపాడాటానికి మనందరం, ప్రేమ, ధైర్యాన్ని పంచాలి’’అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఈ ప్రాణాంతకమైన వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి దేశం మొత్తం ఏప్రిల్‌ 15 వరకు ఎక్కడి ప్రజలు అక్కడే ఉండేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించింది భారతప్రభుత్వం. మొత్తం మీద కరోనా అందరికి ఇబ్బంది పెట్టిన తమ బాధ్యతలను గుర్తు చేసిందంటూ పలువురు సినీ తారలు, ప్రముఖలు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.