23 గంటలు ఉపవాసం పాటించిన హృతిక్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ 23 గంటల పాటు ఉపవాసం ఉన్నాడు. మనిషి డబ్బుకోసం పరిగెత్త కూడదు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు పరిగెట్టాలి. మన జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి అంటూ చాలామంది సలహాలు ఇస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే అది చేసి చూపిస్తారు. హృతిక్‌ రోషన్‌ ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాజాగా హృతిక్‌ ఇరవై మూడు గంటలపాటు ఉపవాసం చేశాడు. అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. రోజువారిగా సూర్యుడితో అనుబంధం పెంచుకోవాలి. లేదంటే మన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పాడు. గతంలో సూర్యడిని ముద్దాడుతున్నట్లు ఉన్న సెల్ఫీని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తన పిల్లలు, మాజీ భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. హృతిక్‌ గత ఏడాది సూపర్‌ 30 అనే చిత్రంలో నటించాడు. తరువాత ఈ ఏడాది టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ‘వార్‌లో సందడి చేశాడు.



Also Read : కరోనాతో ఒక్కటైన హృతిక్‌ దంపతులు  , ‘తన్జాజీ’ దర్శకుడితో హృతిక్‌?
 

View this post on Instagram

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.