‘ఇస్మార్ట్‌ శంకర్‌’గా మారనున్నాడా?

తెలుగులో విశేష ప్రేక్షకాదరణ పొందిన చాలా చిత్రాలు బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తమకు నచ్చిన కథల్ని అక్కడి హీరోలతో పునఃనిర్మిస్తున్నారు హిందీ చిత్ర సీమ దర్శక, నిర్మాతలు. ఈ జాబితాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నిలవనుంది. రామ్‌ కథానాయకుడుగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రమిది. నభానటేష్‌ , నిధి అగర్వాల్‌ నాయికలు. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్‌ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురించారు. తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే పాత్ర ఇది. అందుకే బాలీవుడ్‌ రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమాపై మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్‌ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్‌ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్‌. మరి దర్శకుడు ఎవరు? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.