కమల్‌ వ్యాఖ్యలను ఖండించిన వివేక్‌

ప్రముఖ జాతీయ నటుడు కమల్‌హాసన్‌ తమిళనాడులో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ‘ఈ దేశ మొదటి ఉగ్రవాది హిందువే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మాటలను ఖండిస్తూ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తన ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘కమల్‌ సార్‌ మీరు చాలా గొప్పనటులు. కానీ కళకు ప్రాంతం, మతం అంటూ ఏమీ ఉండవు. కానీ నీవు గాడ్సేను ఉగ్రవాది అన్నావు. బాగానే ఉంది కానీ అతను హిందువుడేనంటూ చెప్పకొచ్చారు. మీరు ప్రసంగించిన ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండవచ్చు.. మీరు వారి ఓట్ల కోసమే ఇలా మాట్లాడారా? ..మీలాంటి పెద్దనటులు కూడా ఓ మామూలు వ్యక్తిలా మాట్లాడడం తగదంటూ’’ పేర్కొన్నారు. కమల్‌హాసన్‌ గత ఏడాది తమిళనాడులో ‘మక్కల్‌ నీధి మయ్యమ్‌’ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో విడుదలైన ‘హే రామ్‌’ చిత్రంలో సాకేత్‌రామన్‌ అయ్యంగార్‌ పాత్రలో నటించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.