రెండో ఛాప్టర్‌లో సంజయ్‌దత్‌

కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రం ‘కె.జి.ఎఫ్‌’. యశ్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం కన్నడలో రూపొందినా, దేశవ్యాప్తంగా విడుదలైంది. హిందీ, తమిళం, తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. రికార్డు స్థాయి వసూళ్లు సొంతం చేసుకొన్న ఆ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా తెరకెక్కబోతోంది. తొలి చిత్రం ‘కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌1’గా విడుదలైంది. మలి చిత్రం ‘ఛాప్టర్‌ 2’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హిందీ కథానాయకుడు సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆ మేరకు సంజయ్‌దత్‌తో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది. వచ్చే యేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.