ఆదిపురుష్‌ చిత్రంతో కార్తిక్ ఆర్యన్‌ చిత్రానికి ఇబ్బంది లేదు

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్,‌ కార్తిక్ ఆర్యన్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్‌ హీరోగా ‘ఆదిపురుష్’‌ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు.  ‘ఆదిపురుష్’‌ సినిమా వల్ల కార్తిక్‌ ఆర్యన్‌ నటించే యాక్షన్‌ చిత్రానికి సంబంధించి ఎటువంటి వార్త లేకపోవడంతో కార్తిక్‌ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్‌ స్పందిస్తూ..‘‘కార్తిక్‌ ఆర్యన్‌తో సినమా కచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కోవిడ్‌-19 కారణాల రిత్యా అనివార్యమైన జాప్యం జరిగింది. అంతేకానీ మరో విశేషం ఏమీలేదు. చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు విదేశాలకు వెళ్లడం అంత ఈజీ కాదు. అందుకే సినిమా స్ర్కిప్టులోనే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్తిక్‌ ఆర్యన్‌ ప్రస్తుతం ‘భూల్‌ భులయ్యా2’, ‘దోస్తానా 2’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల తరువాత రోహిత్ ధావన్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటించనున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.