వచ్చేనెల్లోనే ‘కేజీఎఫ్‌2’ షూటింగ్‌లో పాల్గొంటున్న సంజయ్‌దత్‌

‘కేజీఎఫ్’‌ చిత్రం 2018 సంవత్సరాంతంలో తెరపైకి వచ్చి సందడి చేసింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సీక్వెల్‌గా వస్తున్న ‘కేజీఎఫ్‌2’లో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. యష్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌ తరువాత మంగళూరులో జరుపుకొంటుంది. కొన్ని సన్నివేశాలను ప్రకాష్‌రాజ్‌పై కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ నవంబర్‌ మాసంలో పాల్గొనున్నారు.  మొదటి ‘కేజీఎఫ్’‌లో అధీరా పాత్ర పెద్దగా బయటకురాలేదు. కానీ రెండో భాగంలో పాత్ర ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందట. గత ఏడాది సంజయ్‌దత్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన అధీరా పాత్ర ఫస్ట్ లుక్‌ చాలా బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. అధీరా లాంటి క్రూరమైన పాత్రకోసం సంజయ్‌ వ్యక్తిగతంగాను చాలా ఆసక్తి కనబరిచారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలౌతో్ంది. నటుడు సంజయ్‌కి ఈ ఏడాది ప్రారంభంలో క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం ఇప్పటి చాలా సమయాన్ని వెచ్చించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్‌2’ సెట్లోకి తిరిగి రావడానికి సంజయ్‌ ఉత్సాహంగా ఉన్నారు. హంబేళే ఫిల్మ్స పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకి విజయ్‌ కిరాగండూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 5 భాషల్లో విడుదల్లో విడుదల కానున్న చిత్రంలో రవీనా టాండన్‌,రావు రమేష్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి నాటికి చిత్రం తెరపైకి రానుందని వార్తలొస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.