‘లాల్‌ కప్తాన్‌’ ఫస్ట్‌లుక్‌ ఇదిగో

నాగ సాధువు గెటప్‌లో తీక్షణమైన చూపులతో భయపెడుతున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదు.... బాలీవుడ్‌ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌. ఆయన ఓ నాగసాధువుగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌ కప్తాన్‌’. ‘ఎన్‌ హెచ్‌ 10’ దర్శకుడు నవదీప్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్, ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో సైఫ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఇదో ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా. సైఫ్‌ గొప్ప నటుడు. ఈ చిత్ర కథ ఆయనలోని కొత్త నటుణ్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. భారతీయ వెండితెరపై ఓ కొత్త పంథాలో నడిచిన చిత్రంగా నిలిచిపోతుంద’’ని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దంలో ఓ బ్రిటీష్‌ కెప్టెన్‌పై పోరాడిన నాగసాధువు కథ ఇది. Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.