మా బంధం అంత వరకే!

జావేద్ జఫ్రీ కుమారుడు మీజాన్‌ బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాతో డేటింగ్ చేస్తున్నారని గత కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ‘మలాల్‌’ హీరో మీజాన్‌ మాత్రం ‘‘మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు’’ అంటున్నాడు. నవ్య నవేలి నందా, మీజాన్‌ ఇద్దరు కలిసి న్యూయార్కు నగరంలో కలిసి చదువుకున్నారు. ఆ సందర్బంగా వాళ్లిదర్దురు కలిసున్న కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఓ ముఖాముఖి సమావేశంలో మీజాన్‌ను మీకు ఎవరిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే దానికి సమాధానంగా మీజాన్‌ ‘‘నేను నవ్య వవేలి పెళ్లి చేసుకొంటాను అంటూ తన మనసులో మాట బయట..’’ పెట్టారు.
మీజాన్ నవ్యతో కలిసున్న ఫోటోలలో నవ్య తన ముఖాన్ని కనిపించకుండా దాచుకున్నారు. అంది ఎందుకు దాచిపెట్టారో వెల్లడిస్తూ... "మేము న్యూయార్క్‌లో కలిసి చదువుకునేవాళ్లం, ఆ సమయంలో మేము దిగిన ఆ ఫోటో వైరల్‌గా మారింది. అప్పుడు నా ముఖాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వడం ఇష్టం లేదు అందుకే నేను ముఖం కప్పుకున్నాను" అంటూ చెప్పింది. ప్రస్తుతం మీజాన్‌ ‘మలాల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.