చెట్టెక్కిన హృతిక్‌ తల్లి!

బాలీవుడ్‌ హీరోల్లో ఫిట్‌నెస్‌ అనగానే మొదట గుర్తొచ్చే పేరు హృతిక్‌ రోషన్‌. ఆయన శరీరాకృతికి ఫిదా అయిపోయిన హీరోయిన్లు ఎందరో. హృతిక్‌ తన చుట్టుపక్కల ఉండేవారిని కూడా ఎప్పుడూ కసరత్తులు చేయమని ప్రోత్సహిస్తుంటారు. అమ్మ పింకీ రోషన్‌తోనూ ఎన్నో రకాల వ్యాయామాలు చేయిస్తుంటారు. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతుంటారు 65 ఏళ్ల పింకీ. ఇప్పుడావిడా సునాయాసంగా పెద్ద చెట్టు ఎక్కేశారు. ‘ఏదీ లేనప్పుడు ఏదో ఒకటి ప్రయత్నించడం ఉత్తమం కదా! కొత్త లక్ష్యాలు ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నాన’ంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. వెంటనే దానికి ‘లవ్‌’ అంటూ కామెంట్‌ విసిరాడు హృతిక్‌. ఇప్పుడీ చిత్రంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ‘వార్‌’ చిత్రం తరువాత హృతిక్‌ ఇప్పటికీ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. ఆయన ‘సత్తే పే సత్తా’ రీమేక్‌ చెయ్యనున్నట్లు వార్తలు వచ్చినా.. ఆయన వాటిని ఖండించారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.