డైలాగ్స్‌ నేర్చుకుంటున్న అక్షయ్‌


అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘పృథ్వీరాజ్‌’. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అక్షయ్‌ సరసన ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కోసం అక్షయ్‌ కుమార్‌ డైలాగ్‌కోచ్‌ని పెట్టుకున్నాడట. ఇలా చేయడం అక్షయ్‌కి ఇదే తొలిసారి. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని సంభాషణలను బాగా పలకాలంటే కోచ్‌ను పెట్టుకోవాల్సిన అవసం ఉందని భావించారట. ఇందులో మానుషి చిల్లర్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ భార్య సన్యోయోగిత పాత్రలో కనిపిస్తుంది. కాగా అక్షయ్‌ నటించిన ‘సూర్యవన్షి’ చిత్రం వాయిదా పడింది. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’లో కూడా అక్షయ్‌ నటిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.