బిగ్‌బి ఉత్తరం చూసి మూర్చపోయా!

చాలా మంది తారలు ఈ సినిమాలో బాగా చేశావని అభిమానులు ప్రశంసిస్తేనే ఉబ్బితబ్బైపోతారు. అలాంటి ప్రశంస బిగ్‌ బీ నుంచి వస్తే... నటన బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తితే ఇంకెలా ఉంటుంది! ఎవరి ఆనందానికైనా హద్దులుండవు... అంతేకదా! అలాంటి అభినందనలే ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌ రాధికను వరించాయి. అమితాబ్, రాధికా మదన్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. ఇది ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాధిక నటనకు బిగ్‌బీ ఫిదా అయిపోయాడు. ఆమెను ప్రశంసిస్తూ రాధికకో ఉత్తరం, పూలగుచ్ఛం పంపించాడు. ఆ విశేషాలను ఇన్‌స్టాలో పంచుకుందీ బాలీవుడ్‌ భామ. ‘ఆ అభినందనలు చేసేసరికి నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆ ఉత్తరం బిగ్‌బీ పంపించాడని తెలియగానే మూర్చపోయి కిందపడ్డాను. సంతోషంతో నాకు ఏం చెప్పాలో, ఏం రాయాలో అర్థం కావడం లేదు. ఇది నాకు దక్కిన గౌరవం. నా సినిమా విడుదలైన ప్రతిసారి ఇలాంటివి జరగాలని కలలు కనేదాన్ని. కానీ అది నిజమయ్యే సరికి కొన్ని క్షణాలు నాకేమీ అర్థం కాలేదు. థాంక్యూ సార్‌. కష్టపడి, నిజాయతీగా పనిచేసే నాకు ఈ ప్రసంశ స్ఫూర్తినిచ్చింది’ అని రాసుకొచ్చిందామె.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.