ఆ భాషను అధికారికం చేయాలి...
భాష ఎన్నో భావాలు పలుకుతుంది... ఎంతో మందికి మాధ్యమంగా మారి మరెన్నో బంధాల్ని బలోపేతం చేస్తుంది. మరి మాట్లాడలేనివారి సంగతేంటీ? వాళ్లు ఏ భాష మాట్లాడలేరు కదా? అలాంటివారికి సంజ్ఞలే సాధనం. వాటితోనే ఎన్నో భావాలు వ్యక్తపరుస్తారు. అలాంటి భాషకు అధికార హోదా ఇవ్వాలని గళమెత్తుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. ‘‘యాక్సెస్‌ మంత్ర స్వచ్ఛంద సంస్థ సహాయంతో ‘నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ డెఫ్‌’ రూపొందించిన పిటిషన్‌పై సంతకం చేస్తున్నాను. ఈ సంస్థలు సంజ్ఞల భాషకు అధికారిక గుర్తింపు కోసం అవిరామంగా పోరాడుతున్నాయి. దేశంలోని ప్రతిఒక్కరూ దీనికి మద్దతు ప్రక్రటించాల’’ని ఆయన కోరారు. ఈ గల్లీబాయ్‌ త్వరలో ‘83’, ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

View this post on Instagram

A post shared by Ranveer Singh (@ranveersingh) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.