కొత్తవతారం ఎత్తిన రిచా చద్ధా!

బా
లీవుడ్‌ నటీమణుల్లో కొంతమంది ముక్కుసూటిగా వ్యవరించే వారు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రిచా చద్ధా. ‘ఓయ్‌ లక్కీ! లక్కీ ఓయ్‌’ చిత్రంతో వెండితెర ప్రవేశం చేసిన ఈ అమ్మడు సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గోలియాన్‌ కి రాస్‌లీల రామ్‌ లీల’లో సహాయ పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా రిచా తన ట్విట్టర్లో గంభీరమైన ఫోటో ఒకటి పెట్టింది. ఆ ఫోటోలో రిచా ముడి వేయని జుట్టుతో, మెడలో పూసలు దండలు, ఆకుపచ్చ జాకెట్‌ ధరించి నుదట బొట్టు పెట్టుకొని ఉంది. ఆ ఫోటో చూస్తుంటే చాలా గంభీరంగా కనిపిస్తుంది. అంటే త్వరలోనే ఆమె నటించబోయే చిత్రంలోని ఫోటోని చెప్పకనే చెబుతున్నట్లు ఉంది. రిచా ఈ మధ్యనే అశ్వినీ అయ్యర్‌ తెరకెక్కించిన ‘పంగా’ చిత్రంలో తాప్సీతో కలిసి మీనూ సింగ్‌ పాత్రలో నటించి మెప్పించింది. ఆ మధ్య జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై జరిగిన దాడి సంఘటనకు వ్యతిరేకంగా గళమెత్తింది. అంతే కాదు ఎదైనా సామాజిక సమస్యపై తన వంతుగా ధైర్యంగా అభిప్రాయాన్ని చెబుతోంది. ప్రస్తుతం పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వంలో హాస్య చిత్రంగా తెరకెక్కుతున్న ‘గూమ్‌కేతు’లో నటిస్తుంది. ఇందులో నవాజుద్దీన్‌ సిద్ధిఖి కూడా నటిస్తున్నారు. ఇంకా ‘షకీలా’, ‘బోలి పంజాబన్‌’ అనే చిత్రాల్లోనూ నటిస్తోంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.