మళ్లీ తెరపైకి రిషి కపూర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ మరోసారి వెండి తెరపై కనిపించనున్నారు. అనారోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ‘జూటా కహిన్‌ కా’ చిత్రంలో నటిస్తున్నారాయన. స్మీప్‌ కంగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓంకార్‌ కపూర్, సన్నీ సింగ్, జిమ్మీ షెర్గిల్, మనోజ్‌ జోషి ఇతర తారాగణం. సినిమాకు సంబంధించి రిషికపూర్‌ ఉన్న ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇద్దరు వ్యక్తులను బల్బులతో కూడిన విద్యుత్తు తీగతో బంధించినట్టు ఉండటంతో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రమే సరికొత్తగా ఉంటే సినిమా ఇంకెలా ఉండబోతుందోనని బాలీవుడ్‌ వర్గాలు వేచిచూస్తున్నాయి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వస్తోన్న సినిమా కావడంతో విజయం వరిస్తుందని రిషి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటూ ఈ చిత్రం జులైలో విడుదలకు సిద్ధమవుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.