వారి పేర్లే కాదు మా కళాకారుల పేర్లు పెట్టండి!

మన దేశంలో కళాకరులకు సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోతున్నారు బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌. తాజాగా శశి కపూర్‌ ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ..‘‘భారత్‌దేశంలో సినీ నటులకి, కళాకారులకి సరైన గౌరవం దక్కడం లేదు. ఒక్కసారి మనం విదేశి కళాకారుల్ని పరిశీలిస్తే మీకే అర్థమౌతుంది. ఇక్కడ కొన్ని రహదారులకు, వీధులకు, విమానాశ్రయాలకు రాజకీయ నాయకుల పేర్లకు బదులుగా కళాకారుల పేర్లు పెట్టండి. చాలా బాగుంటుంది. మనం వారిని గౌరవించినట్లు ఉంటుంది. మనకు ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. పండిట్‌ రవిశంకర్, ఉస్తాద్‌ అల్లా రఖా, లతా మంగేష్కర్‌లాంటి ఎంతో మంది ఉన్నారు. పాతవాటిని మార్చకుండా, కొత్తగా కట్టే వాటికి వీరి పేర్లు పెట్టండి - తప్పేముంది. మన దేశ సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టేది మన సినిమాలే. అవే ప్రపంచానికి ఒక గౌరవాన్ని తీసుకొస్తాయని’’ చెప్పారు. రిషి కపూర్‌ గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ విదేశాల్లో చికిత్స తీసుకొని ఈ మధ్యనే ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం రిషి కపూర్, జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది బాడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంలో శోభిత ధూలిపాళ్ల, ఇమ్రాన్‌ హస్మి, వేదిక తదిరులు నటిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.