ముంబైని విడిచివెళ్లను: సైఫ్ అలీఖాన్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ తన సొంతూరు మధ్యప్రదేశ్‌కి వెళ్లనున్నాడని సిద్ధమైయ్యాడని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సైఫ్‌ అలీఖాన్‌..‘‘ప్రస్తుతం ముంబై నుంచి వెళ్లే ఆలోచన లేదు. ఈ నగరాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నా. ఇది నా కలల నగరం. నాకు చాలా ఇచ్చింది. నాకు సంబంధించిన అన్ని రకాల వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. నా ఆశయాలను నిలయం ఈ అందమైన నగరం. మొత్తం నా కుటుంబమే ఇక్కడ ఉంది. మరి నేను వేరొకచోటికి ఎందుకు వెళ్తాను’’ అంటూన్నారు. ప్రస్తుతం సైఫ్‌ ‘బంటీ ఔర్ బబ్లీ2’లో నటిస్తున్నారు. మరో వైపు కరీనా కపూర్‌ అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌సింగ్‌ చద్దా’లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. ముంబై నుంచి సైఫ్‌ వెళ్తున్నాడనే వార్తలు ఎందుకొచ్చాయంటే తన తాతముత్తాలు కట్టిన పటౌడీ ప్యాలెస్‌ని తిరిగి కొనుగోలు చేసి తన శేషజీవితం అక్కడే గడుపుతాడనే ఒకే ఒక్క వార్త ఈ వ్యవహారాలన్నింటికి కారణమైంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.