క్లిక్‌ క్లిక్‌లు ఆపండి.. మా వాడు అంధుడైపోతాడు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ముంబయి ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సైఫ్‌ తన కుటుంబంతో కలిసి వివారయాత్రకు వెü™్లందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో తన ముద్దుల తనయుడు తైమూర్‌ను సైఫ్‌ తన భుజాలపై కూర్చోబెట్టుకోని తీసుకొచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్‌ మనిపించడం మొదలుపెట్టారు. దీంతో సైఫ్‌ వాళ్లపై కోప్పడ్డారు. ‘‘ఫొటోలు తీయడం ఆపండి. ఆ ఫ్లాష్‌ లైట్‌ వల్ల మా అబ్బాయి అంధుడైపోతాడు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు కరీనా - సైఫ్‌లను ఫోజులివ్వాల్సిందిగా కోరారు. దీనిపైనా ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీకు మా ఫొటోలు కావాలంటే తీసుకోండి. కానీ, మీరు అడిగినట్లు పోజులిస్తే వికారంగా ఉంటుంది’’ అని చకచకా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. కరీనా మాత్రం వారికి కొన్ని స్టిల్స్‌ ఇచ్చి వెళ్లిపోయారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

A post shared by Taimur Ali Khan FC💙 (@taimurfc) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.