నేను కూడా అలాంటి బాధితుడినే: సైఫ్‌ అలీఖాన్‌

బాలీవుడ్‌ చిత్రసీమలో ఎంతోమంది వారసత్వం ఉన్నవారు, స్వశక్తిగా ఎదిగినవారు చాలామందే ఉన్నారు. అయితే అందరిని ఒకే గాటన కట్టలేం అంటున్నారు నటుడు సైఫ్‌ అలీఖాన్‌. సైఫ్‌ అలీఖాన్‌ ఈ ఏడాది ఆరంభంలో ‘తన్హాజీ’ చిత్రంలో అజయ్‌ దేవగణ్ ఛత్రపతి శివాజీగా నటించగా, సైఫ్‌ అలీఖాన్‌ ఉదయ్‌ భానుసింగ్ రాథోడ్‌గా నటించి అలరించాడు. ఇక నితిన్‌ కక్కర్‌ దర్శకత్వంలో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘జవానే జానీమన్’‌ చిత్రంలో నలభైదాటిన కూడా ఇంకా ప్రేమ అంటూ ఆడవాళ్లపై మోహం పెంచుకొనే పాత్రలో చాలా బాగా చేశాడు. తాజాగా ఆయన లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు దగ్గర్నుంచి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం  వరకు ఎన్నో సంగతులను ఓ స్వదేశి మీడియాతో పంచుకున్నారు. ‘‘ఈ లాక్‌డౌన్‌ సమయం నాకెంతో నేర్పింది. ముఖ్యంగా మా అబ్బాయి తైమూర్‌ఖాన్‌తో కలిసి ఆడుకోవడం చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఇంత సమయాన్ని వాడితో గడపలేదు. ఇక సుశాంత్‌ గురించి చెప్పాలంటే అతను చాలామంచి భవిష్యత్తు ఉన్న నటుడు అతను ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధేసింది. అతను పెద్దలంటే చాలా గౌరవిస్తాడు. నాతో చాలా సరదగా ఉన్నాడు. అతనికి చాలా విషయం ఉంది. ఖగోళ శాస్ర్తం నుంచి తత్వశాస్ర్తం వరకు అనేక అంశాలు క్షుణ్ణంగా తెలుసు. నాకంటే ఇతనికి అన్నీ విషయాలు బాగా తెలుసు అనుకున్నాను. భారతదేశంలో అసమానత ఉంది. దానిని పోగొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిత్రసీమలో బంధుప్రీతి, అభిమానం, స్వపక్షం విపక్షం, వివిధ గ్రూపులు అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడవన్నీ అనవసరం. నేను కూడా గతంలో ఇలాంటి బాధను ఎదుర్కొన్నవాడినే. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఏమైనా రాబోయో భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఇప్పుడు సినీ వారసత్వం నుంచే కాకుండా బయట నుంచి చాలామంది నటీనటులు వెండితెరపైకి వస్తున్నారు. ముఖ్యంగా నాకు మొఘలుల, నాటి ఈస్ట్ ఇండియా కంపెనీలపై సినిమాలతో పాటు మన పురాణ ఇతిహాసాల నేపథ్యంలో చిత్రాలను తీయాలి. ఇప్పుడు భారతీయులుగా మన చరిత్రను చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని..’’చెప్పారు. సుశాంత్‌ సింగ్‌తో సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించిన చిత్రం ‘దిల్‌ బెచెరా’. జులై 24న డిస్నీ + హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. సుశాంత్‌ చివరిసారిగా నటించిన చిత్రం ఇదే. 
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.