సహ నటుడికి సల్మాన్‌ సాయం


బా
లీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మరో నటుడు దాదీ పాండే కానిస్టేబుల్‌ పాత్ర పోషిస్తున్నాడు. కొంతకాలం ముందు ఆయనకు గుండెపోటు వచ్చింది. సినిమాకు సంబంధించిన సెట్‌లో ఈ ఘటన జరగకపోయినప్పటికీ సల్మాన్‌ పాండేకు సాయం చేసి మానవతా స్ఫూర్తి చాటుకున్నాడు. పాండే బాగోగులు చూసుకోవాలని సల్మాన్‌ తన బృందాన్ని పంపాడు. గోరెగావ్‌లోని ఓ ఆసుపత్రిలో పాండే చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే ఆయన్ను డిశార్జ్‌ చేయనున్నారు. ‘దబాంగ్‌ 2’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘దబాంగ్‌ 3’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే సల్మాన్‌ ‘భారత్‌’ సినిమాతో విజయం అందుకున్న విషయం తెలిసిందే.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.