కట్టప్ప ఎందుకు చంపాడో? తెలియదు

‘‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేందంటున్నాడు’’ హిందీ నటుడు సల్మాన్‌ఖాన్‌. ప్రస్తుతం ఆయన ‘భారత్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే నెల్లోనే ఈ చిత్రం తెరపైకి రానుంది. అయితే ‘భారత్‌’ చిత్రం ప్రచారం కార్యక్రమంలో ఓ సినీ పాత్రికేయుడు ప్రశిస్తూ ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసా అని అడిగారు. అందుకు సమాధానంగా సల్మాన్‌ జవాబిస్తూ...‘‘నేను ‘బాహుబలి’ మొదటి భాగం చూశా. అందులో కట్టప్ప బాహుబలిని చంపాడు. అది మాత్రమే తెలుసు. ఎందుకు చెప్పాడో తెలియాలంటే రెండో భాగం చూడాలి కదా. కానీ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చూడలేదు. కనుక ఎందుకు చంపాడు? ఎలా చంపాడో నాకు తెలియద’’ని నవ్వుతూ సమాధానం చెప్పారు. అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో వస్తున్న ‘భారత్‌’ జూన్‌ 5, 2019న తెరపైకి రానుంది. ఇందులో కత్రీనాకైఫ్, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు. అయితే కొంతమంది సినీ జనాలు సల్మాన్‌ఖాన్‌పై కొన్ని కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. దక్షిణాది సినిమాలను డబ్బింగ్‌ చేసి నటించడం తెలుసు. హిట్లు కొట్టడం తెలుసు. దక్షిణాది చిత్రాలను మాత్రం చూడావా అంటూ..సెటైర్లు వేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.