‘బిగ్‌బాస్‌ సీజ్‌న్‌ 14’ కోసం 250 కోట్లు తీసుకుంటున్న సల్మాన్‌

బాలీవుడ్ నటుడు కండల వీరుడ సల్మాన్‌ఖాన్‌ అంటే అప్పుడు ఇప్పుడూ ఎప్పుడు ఒక్కటే క్రేజ్‌. బిగ్‌బాస్ హిందీ షో ప్రతి ఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఇంకా ఏ సినిమా షూటింగ్‌లోనూ సల్మాన్‌ పాల్గొనలేదు. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 14కు సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. అన్నట్లు బిగ్‌బాస్‌ సీజన్‌ 14 షో కోసం కండల వీరుడు ఎంత పైకం తీసుకుంటున్నాడో తెలిస్తే మన గుండెలు గుభేలుమంటాయి. అక్షరాల 250 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. వారానికి ఒకసారి, రోజుకు రెండు ఎపిసోడ్ల ప్రకారం 12 వారాల పాటు షూటింగ్‌ చేయనున్నారు. షూట్‌ చేసే రోజుకు 20.50 కోట్ల రూపాయలు ముడతాయి. అంటే ఇది సగటున ఎపిసోడ్‌కి 10.25 కోట్లు అన్నమాట. ఇంకా టీవీ ఛానెల్‌ నిర్వహించే కొన్ని అవార్డు షోలకు సైతం హాజరు కావాల్సి ఉంటుందట. బిగ్‌బాస్‌ సీజన్‌ 14 షో అక్టోబర్‌లో బుల్లితెరపై ప్రారంభం కానుంది. ఒక విధంగా చూస్తే బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా సల్మాన్‌ పేరు చెప్పుకోవచ్చు. లాక్‌డౌన్‌ కాలంలో సల్మాన్‌ తన వ్యవసాయక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. అంతేకాదు ఆ సమయంలోనూ నటి జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌తో కలిసి కొన్ని ఆల్బమ్‌ సాంగ్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: మోస్ట్‌ వాంటెడ్‌ భాయి’ చిత్రంలో నటిస్తున్నారు. దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. ఇంకా సినిమాకి సంబంధించి 10 నుంచి 15 రోజుల వరకు షూటింగ్‌ మిగిలి ఉందట. ఇక వచ్చే ఏడాదికి ఏక్‌ థా టైగర్‌ చిత్రానికి సీక్వెల్‌గా టైగర్‌ 3 చిత్రంలో నటించనున్నాడని వార్తలొస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.