సల్మాన్‌ త్వరలోనే తండ్రి అవుతాడట!

బాలీవుడ్‌లోనే అత్యంత ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్‌ తండ్రి అవ్వాలనుకుంటున్నాడట. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? ఉంది.. పెళ్లి చేసుకొని పిల్లలను కనడం కాదు. పెళ్లి కాకుండానే సరోగసి విధానంలో సల్మాన్‌ఖాన్‌ తండ్రి కావడానికి ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. యాభై మూడేళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు సల్మాన్‌కి. గతంలో ముఖాముఖి సమావేశంలో మాట్లాడుతూ..‘‘ఇప్పుడు కాకపోయిన ఎప్పుడొకసారైనా నాన్న అని పిలింపించుకోవాలని ఆశ ఉంది. అయితే అది ఎప్పుడన్నది చెప్పలేను. కనీసం నాకు డెభ్బై సంవత్సరాలు వచ్చిన తరువాత నా బిడ్డకి టీనేజ్‌ దాటుండాలి అంటూ’’ చెప్పారు. ఇప్పటికే సరోగసి పద్దతిలో ఏక్తా కపూర్, షారుఖ్‌ఖాన్, కరణ్‌ జోహార్‌లాంటి వాళ్లు సరోగసి ద్వారా పిల్లను కన్న సంగతి తెలసిందే. సల్మాన్‌ఖాన్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. తన పెంపుడు చెల్లి అర్పితఖాన్‌ కొడుకు అహిల్‌ శర్మతో సరదాగా ఉండే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఇంట్లోని తన మేనఅల్లుళ్లు, బంధువుల పిల్లలతో చాలా ఆప్యాయంగా ఉంటాడని కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.