నాన్నతో సరదాగా...

నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమా షూటింగ్‌ సమయంలో పనిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాడు. కుటుంబ విషయంలో కూడా అంతే. తన తండ్రి సలీమ్‌ ఖాన్‌ అలనాటి సినిమా ‘సుల్తాన్‌’ నుంచి ‘‘సుహానీ రాత్‌ ధల్‌ చుకి’’ అనే పాట పాడుతుంటే తండ్రితో పాటే గొంతు కలిపి కూని రాగాలు తీస్తున్నాడు సల్మాన్‌. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. సల్మాన్‌ బయట ఎన్ని వేషాలు వేసినా రాముడు మంచి బాలుడు అన్నట్లు కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చిన్న పిల్లాడిలా మారిపోతాడు. సల్మాన్‌ నటించిన ‘భారత్‌’ విడుదలై మంచి వసూళ్లే సాధించింది. ప్రస్తుతం తన సమయమంతా కుటుంబంతోనే గడుపుతూ సరదాగా సందడి చేస్తున్నాడు. సల్మాన్‌ తన తండ్రి పాడుతున్న పాటను ట్విట్టర్లో ఫోస్ట్‌ చేస్తూ... ‘‘ది సుల్తాన్, టైగర్‌, భారత్‌ అవర్‌ ఫ్యామిలి.. సింగింగ్‌..’’ ట్యాగ్‌లైన్‌ తగిలించారు.

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.