సింగర్‌గా ‘చుల్‌బుల్‌ పాండే’

‘దబాంగ్‌ 3’తో వచ్చే నెల్లో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు సల్మాన్‌ఖాన్‌. ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు మరో  అదనపు ఆకర్షణ చేర్చే సన్నాహాల్లో చిత్రబృందం ఉందట. ఇందులో సల్మాన్‌ఖాన్‌ ఓ పాట పాడబోతున్నట్లు సమాచారం. ‘‘సల్మాన్‌తో పాట పాడించాలనే ఆలోచన ఉంది. సల్మాన్‌కు సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. ఆయన కూడా ఈ విషయంలో ఆసక్తిగానే ఉన్నారు’’ అని చిత్రవర్గాలు చెప్పాయట. ‘హీరో’లో ‘మైనే హూ హీరో తేరా..’, ‘కిక్‌’లో ‘హ్యాంగోవర్‌..’ లాంటి గీతాలు సల్మాన్‌ ఆలపించినవే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.