రైతులను గౌరవించండి: సల్మాన్‌ఖాన్‌


ప్రపంచంలో ప్రతి మనిషి తినేది ఆహారమే. ఆ ఆహారాన్ని పండించేది రైతు అని అందరికి తెలిసిందే. అందుకే భారతదేశంలో ఎప్పటినుంచో ఓ గొప్పమాట మనకు వినబడుతుంది. అదే ‘‘జై జవాన్‌.. జై కిసాన్’’‌. ఈ రెండే దేశానికి వెన్నెముక. వీరిలో ఒకరు సరిహద్దులో దేశానికి రక్షణగా నిలిస్తే.. మరొకరు దేశ ప్రజలకు తిండిపెడుతున్నారు. అందుకేనేమో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ తాజాగా తన ట్విట్టర్లో మట్టిలో మమేకమైన ఓ ఫోటోను పెట్టారు. అంతేకాదు ఆ ఫోటోకి ‘‘రైతులందరికి నా గౌరవ వందనం’’..అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. సల్మాన్‌ఖాన్‌ గత కొన్నాళ్లుగా లాక్‌డౌన్‌ పాటిస్తూ తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. తనతో పాటు ప్రియురాలు లులియా వంతూర్‌, జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌ ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ సమయంలోనే ‘ప్యార్ కరోనా", ‘‘తేరే బినా’, ‘‘భాయ్ భాయ్’’ లాంటి ఆల్బమ్‌ వీడియో గీతాలను సైతం విడుదల చేశారు. సల్మాన్‌ఖాన్‌ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది మేనెల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌ కారణంగా నవంబర్‌ 13, 2020కి వాయిదా పడింది. సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాణంలో ‘కబీ ఈద్ కబీ దివాలి’ అనే చిత్రం చేయనున్నాడు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.