సల్మాన్‌ బాడీగార్డ్‌ జీతమెంతో తెలుసా?

సినిమా షూటింగ్స్, ఆడియో విడుదల, ముందస్తు విడుదల వేడుకల్లో ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులతోపాటు వాళ్ల అంగరక్షకులు కనిపిస్తుంటారు. అభిమానులు ఎవరైనా ఆటోగ్రాఫ్, సెల్ఫీ కోసం వెü™్త అడ్డుపడుతుంటారు. వాళ్ల పనే బావుంది. హీరోహీరోయిల్ని చూస్తారు. వాళ్లతో ఉంటారు అనిపిస్తుంది కదా. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అంగరక్షకుణ్ని చూస్తే ముంబయి వాసులకు ఇదే అనిపిస్తుంటుంది. ఆయనే షెరా. 1995లో సల్మాన్‌ బాడీగార్డ్‌గా నియమితుడై ఇప్పటికీ ఆయన వెంటే ఉంటున్నాడు. వీళ్లద్దరి కాంబోకి ప్రత్యేకంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటేనే ఆయన రేంజ్‌ ఏంటో అర్థమవుతుంది. ఇంతకీ షెరాకి సల్మాన్‌ ఎంత జీతం ఇస్తాడో తెలుసా? రూ.15 లక్షలట. ఇతర వేతనాలు కలిపి సంత్సరానికి రూ.2 కోట్లకు పైగా సంపాదిస్తాడట షెరా. అంతేకాదు షెరా కుమారుణ్ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సల్మాన్‌ ఉన్నాడని సమాచారం. ‘నేనెప్పుడూ సల్మాన్‌ పక్కన, వెనక ఉండను. ముందు మాత్రమే ఉంటాను. ప్రతిక్షణం ఆయన్ను గమనిస్తూ ఉంటాన’ని ఓ సందర్భంలో చెప్పాడు షెరా. ప్రస్తుతం సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’లో నటిస్తున్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.