గోడకేసి తలబాదుకున్న సల్మాన్‌ ఖాన్‌!బాలీవుడ్‌ చిత్రసీమలో ఎన్నో ప్రేమకథలు, మరెన్నో సంఘటనలు, బాధలు అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. ఏ హీరో-హీరోయిన్లను తీసుకున్న వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి బాధపడి ఉంటారు. అలాంటి ఘటననే సల్మాన్‌ ఖాన్‌ జీవితంలోను జరిగింది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ - సల్మాన్‌ ఖాన్‌ కలిసి ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’లో నటించారు. సంజయ్‌ లీలా నిర్మాణదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కుపించింది. అప్పుడే ‌ వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓ సారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు తన తలను గోడకేసి బద్దలు కొట్టుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో ఇరువురి మధ్య కొంత మనస్పర్థలు కూడా వచ్చాయని కూడా అప్పట్లో బాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ..‘‘కొన్ని సార్లు మా ఇద్దరి మధ్య సరైన అవగాహన లేనప్పుడు, నేనే ఎంతో బాధకై లోనై బాధపడ్డాను తప్ప. వేరెవ్వరిని నొప్పించ లేదు అని చెప్పాడు. మొత్తం మీద జీవితంలో కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు సంతోషం, కంటే బాధపెట్టిన సంగతులే బాగా గుర్తుంటాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.