తుఫానుతో దెబ్బతిన్న ఫామ్‌హౌస్‌ని బాగుచేస్తున్న సల్మాన్‌

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సినిమాల్లో ఎన్నో పాత్రల్లో హీరోగా చేసి మెప్పించారు. నిజజీవితంలోనూ ఆయన తోటీవారిని ఆదుకుంటూ ముందుంటున్నాడు. తాజాగా నిసార్గా తుఫానుతో తను ఉండే వ్యవసాయక్షేత్రం కొంత పాడైంది. నిన్న ప్రపంచ పర్యావరణదినోత్సవం. ఈ సందర్భంగా పాడైపోయిన తోటను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వయంగా సల్మాన్‌ విరిగిపోయిన చెట్ల కొమ్మలను తొలగించి, చీపురుతో ఊడుస్తూ స్వచ్ఛ భారత్‌ను అమలు చేసి చూపెడుతున్నాడు. ఆయనతో పాటు ప్రియురాలు లులియా వంతూర్‌, జాక్విలైన్‌ ఫెర్నాండజ్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈవీడియో అంతర్జాలంలో వైరలౌతోంది.


View this post on Instagram

#SwachhBharat #WorldEnvironmentDay Music Credits: Mark Mothersbaugh

A post shared by Salman Khan (@beingsalmankhan) on

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి సల్మాన్‌ తన కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటూ ‘తేరే బినా’ అంటూ సాగే వీడియో ఆల్బమ్‌ సాంగ్‌ని విడుదల చేశాడు. ఈ పాటలో సల్మాన్‌ - జాక్విలైన్‌ ఫెర్నాండజ్‌తో కలిసి సందడి చేశాడు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్‌ మోస్ట్ వాంటెడ్‌ భాయి’ అనే చిత్రం చేస్తున్నాడు. చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.