జాక్విలైన్‌తో కలిసి పాటపాడిన సల్మాన్‌ఖాన్‌!

లాక్‌డౌన్‌ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ పేదలకు కావాల్సిన నిత్యావసర సామాగ్రిని అందజేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఫామ్‌హౌస్‌లో ఉంటూ తనలోని గాయకుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆ మధ్య కరోనాపై ‘ప్యార్‌ కరోనా’ అంటూ పాట అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి నటి జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌తో కలిసి ‘తేరే బినా’ అంటూ గొంతువిప్పారు. ఈ సందర్భంగా సల్మాన్‌ మాట్లాడుతూ..‘‘ఇది కేవలం నాకోసమే పాడుకున్నాను. దీన్ని చిత్రీకరించడానికి నాలుగురోజుల సమయం పట్టింది. ఈ పాటను ఏ సినిమాలోనూ పెట్టాలనుకోవడం లేదని చెప్పాడు. మధ్యలో జాక్విలిన్‌ కల్పించుకుంటూ ‘ఈ పాటను బయటకు ఎందుకు చూపించడం అని అడగ్గా’ ఇది నా సొంతం’ అంటూ’’ జవాబిచ్చాడు’’. చాలా కాలంగా సల్మాన్‌ తన సన్నిహితులతో కలిసి నగరానికి దూరంగా ఉన్న వ్యవసాయక్షేత్రంలోనే ఉంటూ లాక్‌డౌన్‌ సమయాన్ని ఇలా గడుపుతున్నారు. అక్కడ జరిగే సంగతులను ఎప్పకప్పుడు తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యుట్యూబ్‌ ద్వారా అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు తన దగ్గర పనిచేసే కార్మికులను సైతం చాలా జాగత్త్రగా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం సల్మాన్‌ ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.