కొరియన్‌ చిత్రంపై షారుఖ్‌ కన్ను

కిం
గ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ చిత్రం ‘జీరో’ (2018) తరువాత మరే ఇతర చిత్రాల్లోనూ చేయలేదు. ఇప్పుడు షారుక్‌కు చెందిన రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్షిణ కొరియాకి చెందిన ‘ఎ హార్డ్‌ డే’ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమాకి సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం చేపట్టవచ్చుననే వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో కింగ్‌ఖాన్‌ షారుక్‌ నటిస్తాడా లేదా అనేది ఇంకా తెలియదు. దక్షిణ కొరియాలో యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎ హార్డ్‌ డే’ సినిమా అక్కడ కాసుల వర్షం కురిపించింది. షారుక్‌ ఇప్పటికే రాజ్‌ కుమార్‌ హీరానీతోను, మరోవైపు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలైన రాజ్‌ నిడమూరు, డికె కృష్ణలతోను సినిమాలు చేయనున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ‘రాధే’ చిత్రం కూడా కొరియన్‌ చిత్రానికి రీమేక్‌ కావడం విశేషం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.