అమితాబ్‌ను మించి షారుఖ్‌ రికార్డు

అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్‌లో మాత్రమే కాదు అన్ని చిత్ర పరిశ్రమల్లో అభిమానులున్న స్టార్‌ కథానాయకులు. సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. ఈ ఇద్దరి క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతుంటుంది. ఓ సారి వీళ్ల ట్విటర్‌ ఖాతాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ విషయంలో అమితాబ్‌ను దాటేశాడు షారుఖ్. ఇప్పటి వరకు 38.8మిలియన్ల ఫాలోవర్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు అమితాబ్‌. తాజాగా ఆ సంఖ్యను దాటి ట్విటర్‌ ఖాతాలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న తొలి భారతీయ సెలబ్రెటీగా రికార్డు సృష్టించాడు ఖాన్‌. ఇంతకీ ఖాన్‌ను అనుసరించేది ఎంతమందంటే? 39మిలియన్ల అభిమానులు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు షారుఖ్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.