వామ్మో.. షాహిద్‌ అంత ఖరీదైన ప్లాట్‌ కొన్నాడా?

బాలీవుడ్‌ నయా దేవదాస్ ‘కబీర్‌ సింగ్‌’ అలియాస్‌ షాహిద్‌ కపూర్‌ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ముంబయిలోని ఓర్లీ ప్రాంతంలో ఓ ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు షాహిద్‌. దాదాపు 8625 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంట్లో దాదాపు 10 కార్లు పార్క్‌ చేసుకోవడానికి సరిపోయేంత విశాలమైన స్థలంతో పాటు అద్భుతమైన అధునాతన సౌకర్యాలు ఉన్నాయట. ఇక ఈ ప్లాట్‌లోని ఇంటీరియర్‌ డిజైన్‌ మరింత ప్రత్యేకంగా ఉంటుందట. విదేశాల నుంచి తెప్పించిన ఖరీదైన ఆర్టికల్స్‌ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ.. దాదాపు రూ.56 కోట్ల ఖర్చుతో దీన్ని కొనుగోలు చేశారట షాహిద్‌. ప్రస్తుతం ఈ యువ హీరో ఈ ప్లాట్‌తో పాటు ముంబయిలోనే మరో బహుళ అంతస్థుల సముదాయాన్ని కూడా నిర్మించుకుంటున్నారట. త్వరలోనే అది కూడా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.