నవ్వించే పోలీస్‌...షారుఖ్‌?

షారుఖ్‌ ఖాన్‌... బాలీవుడ్‌ బాద్‌ షా. ఆయన సినిమా విడుదలవుతుంటే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని చాలా చిత్రాలు నిరూపించాయి. అయితే షారుఖ్‌ ‘జీరో’  చిత్రం తరువాత మరో సినిమా గురించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అభిమానులందరూ షారుఖ్‌ పుట్టినరోజున తీపి కబురు చెప్తాడని ఆశించారు. కానీ, వారికి నిరాశే మిగిలింది. షారుఖ్‌ నటించబోయే సినిమా ఇదేనంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా దీని గురించి మరో వార్త హిందీ చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. షారుఖ్‌ ఒక కొరియన్‌ రీమేక్‌లో నటిస్తారని సమాచారం. దీనికి ‘జీరో’ దర్శకుడు నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇది హాస్యభరితమైన కథ అని వినికిడి. ఇందులో అందర్ని నవ్వించే పోలీస్‌ పాత్రలో షారుఖ్‌ కనిపిస్తాడట. మరి ఈ కథైనా షారుఖ్‌ పట్టాలెక్కిస్తాడా, లేదా? అనే విషయం తెలియాలంటే మరి కొంత కాలం ఎదురుచూడాల్సిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.