తమిళ రీమేక్‌లో సిద్ధార్థ మల్హోత్రా

‘మర్జావాన్‌’ చిత్ర హీరో సిద్ధార్థ మల్హోత్రా ఓ కొత్త చిత్రం చేయనున్నారు. తమిళంలో విజయవంతమైన ‘తడమ్‌’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ‘మే’లో సెట్స్‌పైకి వెళ్లనుంది. యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న దీన్ని నవంబర్‌ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్‌ని దిల్లీలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జరిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమిళంలో అరుణ్‌ విజయ్‌ నటించిన ‘తడమ్‌’ 2019లో విడుదలై మంచి వసూళ్లే సాధించింది. ప్రస్తుతం సిద్ధార్థ, పరమవీరచక్ర అవార్డు గ్రహిత ఆర్మీ కెప్టన్‌ విక్రమ్‌ బాత్రా జీవితాధారంగా వస్తున్న ‘షేర్షా’లో నటిస్తున్నాడు. విష్ణువర్థన్‌ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమయ్యే ఇది జులై 3న విడుదల కానుంది.



View this post on Instagram

A post shared by Sidharth Malhotra (@sidmalhotra) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.