ఫ్యాషన్‌ గర్ల్‌.. మొగల్‌ సామ్రాజ్య మహారాణిలా!!

ఎవరి రాక కోసమైతే సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. ఫ్యాషన్‌ ప్రపంచమంతా కెమెరాలు మెడలో వేసుకోని ఫ్లాష్‌ లైట్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోందో ఆ శుభ తరుణం వచ్చేసింది. కేన్స్‌ వేడుకలోకి ఫ్యాషన్‌ గర్ల్‌ సోనమ్‌ కపూర్‌ అదరగొట్టేలా ఎంట్రీ ఇచ్చేసింది. తనదైన స్టైలిష్‌ లుక్స్‌తో ప్రేక్షకలోకాన్ని సమ్మోహన పరిచింది. ఎర్రతివాచిపై హంస నడకలతో హొయలు పోతూ కుర్రకారు మదిలో గుబులు రేపింది. భారతీయ సంప్రదాయానికి పట్టం కడుతూనే.. మొగల్‌ సామ్రాజ్యపు మహారాణుల్ని తలపింపజేసేలా బంగారు వర్ణపు గౌనులో వచ్చి కేన్స్‌ 2019 ఉత్సవాలకు కొత్త సొబగులు పొదిగింది. ఈ గౌనుకు తగ్గట్లుగానే మెడలో వేసుకున్న బంగారు వర్ణపు హారం మరింత అద్భుతంగా సెట్‌ అయిపోయింది. ఇంతకీ ఈ డ్రెస్‌ను ఎవరు డిజైన్‌ చేశారÁ తెలుసా.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్స్‌ అబుజానీ, సందీప్‌ కోస్లా.




మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.