ఆకాశవీధిలో సుశాంత్‌ కలల ప్రయాణం

‘పీకే’, ‘ఎమ్‌.ఎస్‌. ధోని’, ‘కేదార్‌ నాథ్‌’ వంటి హిట్లతో అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్‌హీరో స్థాయికి ఎదిగాడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. తనదైన స్టైల్, ఆకట్టుకునే అభినయంతో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడీ యువ హీరో పైలట్‌గా మారి ఆకాశ వీధుల్లో వీరవిహారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట. ఇదేదో సినిమాలో పాత్ర కోసం చేయాలనుకుంటున్న స్టంట్‌ కాదులేండి. సుశాంత్‌కు చిన్నప్పటి నుంచే పైలెట్‌ అవ్వాలని కోరికుండేదట. కానీ, అదెందుకో ఇంతవరకు నెరవేరలేదు. అందుకే ఇప్పుడు ప్లైట్‌ నడపడంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడట. తాజాగా దీనికి సంబంధించి ఫ్లైట్‌ నడుపుతుండగా తీసిన ఓ వీడియోను తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పోస్ట్‌ చేశాడు సుశాంత్‌. ‘ప్రస్తుతం కొంచెం తడబడుతున్నా.. త్వరలోనే సమర్థవంతంగా ఫ్లైట్‌ నడుపుతాన’ని ధీమా వ్యక్తం చేశాడు. సుశాంత్‌ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మీ ఫస్ట్‌ ఫైలట్‌ జర్నీలో మమ్మల్ని కూడా తీసుకెళ్లాలి అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.