నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మనోజ్‌ బాజ్‌పేయి

ప్రముఖ బాలీవుడ్‌ క్యారక్టర్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ప్రస్తుతం చిత్రసీమలో తనకంటూ ప్రేత్యకను సంపాదించుకున్నాడు. ‘చిత్రసీమకు వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాను ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని’ అంటున్నాడు మనోజ్‌ బాజ్‌పేయి. అశ్రితపక్షపాతం, బంధుప్రీతి ఇంకా అనేక విషయాల గురించి తాజాగా బాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాల, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై ఆయన స్పందిస్తూ.. ‘‘నేకొక సాధారణ రైతు కొడుకుని. నాతోబుట్టువలు ఐదుమంది. మాది బీహార్‌లోని ఓ గ్రామంలోనే పెరిగాను. చిన్నప్పుడు పూరిగుడిసె పాఠశాలకు వెళ్లేవాణ్ణి. అందరిలా సాధారణ జీవితం గడిపేవాణ్ని. కానీ దగ్గరలోనే ఉన్న పట్టణానికి వచ్చినప్పుడు సినిమా థియేటర్‌కి వెళ్తాను. నేను అమితాబ్‌ బచ్చన్‌కి వీరాభిమానిని. ఆయనలా ఉండాలని కోరుకునేవాడిని. అప్పుడు నా వయసు తొమ్మిది సంవత్సరాలు. ఆ తరువాత నేను నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా సంస్థలో చేరడానికి అప్లికేషన్‌ పెట్టాను. మూడుసార్లు వాళ్లు తిరస్కరించారు. ఆ సమయంలో నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముట్టాయి. అయినా నా స్నేహితులు ఎప్పుడూ నన్ను అనుసరిస్తూ ఉండేవారు. అదే ఏడాది టిగ్మాన్షు తన ఖతారా స్కూటర్‌ వేసుకొని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు నేను టీ షాపులో ఉన్నా. శేఖర్‌ కపూర్‌ ‘బండీట్‌క్వీన్’‌ చిత్రంలో పాత్ర ఇస్తానని చెప్పాడు. వెంటనే ముంబైకి బయలుదేరాను. అక్కడికి చేరిన తరువాత 5మందితో కలిసి అన్నం తినేవాణ్ని. వేషం కోసం ఎన్నో రోజులు తిరిగాను. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. ఓసారి నా ఫోటో‍ను ఒక ఏడీ చించేసింది. అప్పుడు 3 ప్రాజెక్టులో అవకాశాలు చేజారాయి. ఆ తరువాత మేకప్‌ వేసి నువ్వు సినిమాల్లో నటించడానికి నీ ముఖం బాగాలేదంటూ ఎగతాళి చేశారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఒక్కోసారి చాలా ఆకలి వేసేది. అద్దె చెల్లించడానికి డబ్బులుండేవి కావు. వడ పావ్‌ తినటానికి కూడా నోచుకోలేకపోయాను. కానీ అక్కడి నుంచి వెనుదిరగలేదు. అలా నాలుగు సంవత్సరాల తరువాత దూరదర్శన్‌లో మహేష్‌ భట్‌ చేస్తున్న ‘స్వాభిమాన్‌’ సీరియల్లో అవకాశం తలుపుతట్టింది.

ఆ పాత్ర చేసినందుకు 1500 వందల రూపాయలు ఇచ్చారు. అదే నా మొదటి స్థిరమైన సంపాదన. అలా గుర్తింపు వచ్చిన తరువాత బాలీవుడ్‌లో ‘సత్య’ సినిమాకు అవకాశం వచ్చింది. దాంతో నాకు పెద్ద విజయం లభించింది. ఎన్ని కష్టాలు ఎదురైన వాటిని దాటుకొని వచ్చినప్పుడు, మరో కొత్త విజయం వరిస్తే అవన్నీ మర్చిపోతాం...’’ అంటూ చెప్పకొచ్చారు. మనోజ్‌ తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి ‘హ్యాపీ’ చిత్రంలో నటించాడు. ఆ తరువాత ‘వేదం’, ‘పులి’ లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వెబ్‌సీరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ అనే ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో సమంత అక్కినేని కూడా నటిస్తోంది. త్వరలోనే  విడుదల కానుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.