టైగర్‌ ‘రాంబో’ చిత్రానికి రోహిత్‌ దర్శకత్వం చేస్తున్నారా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా హాలీవుడ్‌ హీరో సిల్వర్‌ స్టాలోన్‌ నటించిన ‘రాంబో’ చిత్రాన్నిబాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. తొలుత ఈ సినిమా గురించి 2017లో ప్రకటన చేశారు. అప్పట్లో చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తాడని కూడా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో బాలీవుడ్ రచయిత, దర్శకుడు రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం చేపట్టనున్నారనే వార్తలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తయారు చేసిన స్ర్కిప్టు బ్లూఫ్రింట్‌ ఆధారంగా భారీఎత్తున సినిమాని తీయనున్నారట. ఈ చిత్రం గురించి 2017లోనే హాలీవుడ్ నటుడు రాంబో హీరో సిల్వర్‌ స్టాలోన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారగానే స్పందిస్తూ..‘‘చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారనే వార్త విన్నాను. మంచిది. అయితే పాత్ర అసలు రూపాన్ని పాడుచేయరని ఆశిస్తున్నా. చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ తెలిపారు. ప్రస్తుతం రోహిత్‌ ధావన్‌ తెలుగులో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేస్తున్నారు. చిత్రంలో కార్తిక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత టైగర్‌ ‘రాంబో’ చిత్రం ఉండవచ్చని సమాచారం వినిపిస్తోంది. ఇక టైగర్ గత ఏడాదిలో ‘వార్’‌ చిత్రంలో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించి అలరించారు. ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌ ‘హీరో పంటి 2’లో నటిస్తున్నారు. అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్‌ కథానాయికగా నటిస్తోంది. సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.