చిత్రీకరణలో ప్రమాదం.. విక్కీ కౌశల్‌కు గాయాలు

‘యురీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రంతో దేశం దృష్టించిన ఆకర్షించిన యువ కథానాయకుడు విక్కీ కౌశల్‌. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా విక్కీకి గాయపడ్డాడు. భాను ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో విక్కీ నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ గుజరాత్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఓ తలుపు మీద పడటంతో దవడ ఎముకలు విరిగాయి. దీంతో ఆయన్ని వెంçనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దవడకు గట్టిగా తగలడంతో 13 కుట్లు పడినట్టు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.