కత్రీనాతో ఎలాంటి సంబంధం లేదు..

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ చిత్రం విడుదలైన తరువాత విక్కీ పేరు బాలీవుడ్‌ అంతటా తెలిసిపోయింది. ఆ సినిమాలో మేజర్‌ విహాన్‌ సింగ్‌ సెర్గిల్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం విక్కీ కౌశల్‌ - కత్రీనాల కైఫ్‌ల బంధంపై కొన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. విక్కీ మాజీ ప్రియురాలు నటి హర్లిన్‌ సేథితో గత కొంత కాలంగా సరైన సంబంధాలు లేవు. ఈ ఎడబాటుకు కారణం బాలీవుడ్‌ నటి కత్రీనా కైఫేనని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి. విక్కీ ఈ వార్తపై స్పందస్తూ..‘‘ఒకరోజు నేను ఉదయాన్నే నిద్రలేచే సరికి అమ్మనాన్నలు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఉన్నారు. నన్ను అదే పనిగా చూస్తున్నారు. నేను అక్కడికి వెళ్లి ఓ పత్రికను తిరగేయడంతో దాంట్లో కత్రీనాతో విక్కీకి ఏదో బంధం ఉందంటూ రాశారు. నేను అలా ఉండిపోయాను. నన్ను అదే పనిగా కోపంగా చూస్తూ అమ్మనాన్నలు ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు. హమ్మయ్య అయితే వీళ్లు ముందే వార్త చదివారా అంటూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నా. కత్రీనాతో ఎలాంటి బంధం లేదు. కేవలం స్నేహితురాలు మాత్రమే’’ అంటూ చెప్పకొచ్చారు. అసలు ఈ పుకార్లు రావడానికి కారణం కత్రీనా కైఫ్‌ ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేకపోవడం, విక్కీకి కూడా హర్లిన్‌ సేథితో దూరంగా ఉండడం వల్లేనని కొంతమంది సినీ జనాలు అనుకుంటున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.