అలాంటిది ఏమీ లేదు!

బాలీవుడ్‌ సినీ నటుల వ్యక్తిగత అభిరుచులను, అలవాట్లను తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఉంటారు. కొంతకాలంగా నటి కత్రీనా కైఫ్, ‘ఉరి’ నటుడు విక్కీ కౌశల్‌ మధ్య డేటింగ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదే విషయంపై విక్కీని కొంతమంది అడగ్గా అందుకు స్పందించన విక్కీ...‘‘నా వ్యక్తిగత జీవితాన్ని కొంతవరకు బహిర్గతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. నేను కత్రీనా విషయంలో ఏమీ మాట్లాడినా అదో పెద్ద చర్చ అవుతుంది. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇప్పటి వరకు ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన విషయం గురించి నాతో మాట్లాడించడం, దానికి మీరు (మీడియా) మరో రెండు మాటలు జోడించి రాయడం, ఇలా ఎడతెగని వ్యవహారంగా తయారు చేస్తున్నారు..’’ అంటూ చెప్పారు. ప్రస్తుతం విక్కీ కౌశల్‌ స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్‌ ఉదమ్‌ సింగ్‌ జీవితాధారంగా వస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. సుజీత సర్కార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అక్టోబర్‌ 2, 2020న తెరపైకి రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.